ఇంట్లో ఉంటూ ఇవి చేయండి!

చిన్నవారి నుంచి పెద్దవారి వరకు, పేదల నుంచి సంపన్నుల వరుకు, సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరినీ ఇంటికే పరిమితమయ్యేలా చేసింది కరోనా మహమ్మారి. ప్రపంచంలోని అన్ని దేశాలను ఈ వైరస్‌ వణికిస్తున్న నేపథ్యంలో చాలా దేశాలు లాక్‌డౌన్‌ ను ప్రకటించాయి. దీంతో ప్రజలందరూ ఇంటికే పరిమితమయ్యారు. భారత్‌లో ఈ లాక్‌డౌన్‌ 21 రోజుల పాటు కొనసాగనుంది. అయితే ఈ అవకాశాన్ని ‘మేం ఫిట్‌గా తయారవ్వాలి’ అని అనుకునే వారు చక్కగా ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు.




రోజూ వ్యాయామం చేసే అలవాటు ఉన్నవారు ఏ పార్క్‌కో, జిమ్‌కో, ఫిట్‌నెస్‌ సెంటర్‌కో వెళతారు అయితే లాక్‌డౌన్‌ కారణంగా ఇవేవి ప్రస్తుతం అందుబాటులో లేవు. అయితే లాక్‌డౌన్‌ కాలంలో ఇంట్లో ఉంటూనే వ్యాయామాలు చేస్తే మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. పెద్దవారు కనీసం రోజుకు అరగంటసేపు వ్యాయామం చేయాలని సూచించింది. ఒక గంటపాటు వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉండటంతో పాటు మానసికంగా ఉల్లాసంగా ఉంటారని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతగా నిద్రపోవడానికి కూడా వ్యాయామాలు దోహద పడతాయని పేర్కొంది. కరోనా వైరస్‌ కారణంగా ఇంటి నుంచే పనిచేస్తున్న వారు మధ్యలో బ్రేక్‌ ఇస్తూ అప్పుడప్పుడు లేచి నిలుచోవాలని, బాడీని స్ట్రచ్‌ చేయాలని తెలిపింది. వర్క్‌ ఫ్రం హోం చేసేవారు సరైనా పద్దతిలో కూర్చోని  పని చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఈ నేపథ్యంలో ఇంటివద్ద నుంచే వ్యాయామం చేయడానికి ఉన్న కొన్ని మార్గాలు ఒకసారి పరిశీలిద్దాం.